Wednesday, August 12, 2015

"ఉపేంద్ర-2" ఉపేంద్ర రేంజ్ లో ఆకట్టుకుంటుందా ?
కోలీవుడ్ లోని చాలామంది హీరోలకు తెలుగులో ఫాలోయింగ్ ఉంది కానీ... కన్నడ ఇండస్ట్రీలోని హీరోల్లో ఒక్క ఉపేంద్ర మాత్రమే టాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకోగలిగాడు. పలు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించిన ఈ కన్నడ స్టార్... 'ఎ', 'రా', 'ఉపేంద్ర' వంటి పలు సినిమాలతో తెలుగులోనూ మాస్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. ఉపేంద్ర సినిమాలంటేనే డిఫరెంట్ గా ఉంటాయని భావించిన ప్రేక్షకులు... ఆయన మార్క్ సినిమాల కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అయితే అలాంటి సినిమాలు రాక చాలా ఏళ్లయ్యింది. లాంగ్ గ్యాప్ తరువాత రీసెంట్ గా ఉపేంద్ర 2 సినిమాను డైరెక్ట్ చేశాడు ఉపేంద్ర. దాంతో ఈ కన్నడ స్టార్ నయా మూవీపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


ఉపేంద్ర సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన ఉపేంద్ర 2 ఎలా ఉంటుందనే అంశం ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా పోస్టర్లలో ఉపేంద్రను చూసిన సినీ జనం... ఒకప్పటి ఉపేంద్ర మూవీ లాగే ఇది కూడా కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు సినిమా పోస్టర్ మీదే ఐ యామ్ డిఫరెంట్ అని ఉండటంతో... సినిమా ఎలా ఉంటుందనే విషయం ఊహించడం కూడా కష్టమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉపేంద్ర నటించిన మిగతా సినిమాలపై అంత ఆసక్తి ఉండకపోయినా... ఈ సినిమా ఉపేంద్రకు సీక్వెల్ కావడంతో మాస్ ఆడియెన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి... ఉపేంద్ర సినిమాతో ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అందుకున్న ఈ కన్నడ హీరో... ఉపేంద్ర 2తో అదే రేంజ్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.http://www.andhrajyothy.com/Artical?SID=139941

ఆగస్టు 15న వరుణ్ తేజ్-క్రిష్‌ల 'కంచె' టీజర్...

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె'. బాలీవుడ్‌లో ఇటివలే గబ్బర్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.
kanche still
 
ఈ చిత్రం మొదటి టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్, మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.
 
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యంలో, 1940లలో సాగే ఒక కథను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు. 
 
భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
http://telugu.webdunia.com/article/telugu-cinema-news/kanche-movie-115081200075_1.html

Monday, August 10, 2015

Wednesday, March 25, 2015

'సన్నాఫ్ సత్యమూర్తి' టీజర్ షాక్.. పవర్ స్టార్‌ను కాపీకొట్టిన బన్నీ...!


son of satyamoorthi
యంగ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఫస్ట్ లుక్, ప్రీ ఫస్ట్ లుక్ లతో ఆకట్టుకున్న త్రివిక్రమ్‌, టీజర్‌ లో ఏమి చూపించబోతున్నాడోనని మెగా ఫ్యాన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తీరా టీజర్ రిలీజయ్యాక చూసి షాక్‌కు గురయ్యారు. 
ఎందుకంటే త్రివిక్రమ్‌ ఇంకా 'అత్తారింటికి దారేది' హ్యాంగోవర్‌లోనే ఉన్నాడని తెలుస్తోంది. అత్తారింటికి దారేది టీజర్ కాపీ పేస్ట్ చేసి 'సన్నాఫ్‌ సత్యమూర్తి' టీజర్‌గా చూపించినట్టుగా ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాగే, బన్నీ నడిచి వస్తూ కనిపించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో దేవిశ్రీప్రసాద్‌ పాట రావడం, డ్రెస్సింగ్ స్టైల్ కూడా పవన్ ని పోలి వుండడం అందరిని షాక్ కి గురి చేసింది. 
అసలకే ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. కానీ టీజర్ మాత్రం ఆ అంచనాలను ఆవిరి చేసింది. దీంతో సినిమాను కొన్నవారు సినిమా అయినా కొత్తగా వుంటుందో లేక అత్తారింటికి దారేదిని లాగే ఉంటుందో అనే టెక్షన్ మొదలైంది. అయితే సినీ యూనిట్ మాత్రం ఈ టాక్‌పై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.

మేమంతా మెగాస్టార్ నీడ నుంచి వచ్చాం... దాసరికి బన్నీ కౌంటరా...?!!

దాసరి నారాయణ రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన అన్న మాట ఒకటి ఇప్పుడు మెగా హీరోల్లో దుమారం రేపుతోంది. మొన్నామధ్య ఏకంగా నాగబాబును చుట్టుముట్టిన మెగా అభిమానులు దాసరి కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఆ ఎఫెక్టో ఏమోగానీ రుద్రమదేవి ఆడియో వేడుక సందర్భంలో వరంగల్ వేదికగా అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి గురించి మాట్లాడాడు. 
allu arjun

 
తామిప్పుడు స్టెప్పులేస్తున్నా... తామంతా నటులుగా వెలుగుతున్నా అదంతా మెగాస్టార్ చిరంజీవి వల్లనే అని అన్నారు. చిరంజీవి గారు ఆనాడు ఎండలో కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరితే ఇప్పుడు తామంతా మెగాస్టార్ నీడలో బతుకుతున్నామనీ, హీరోలుగా మీముందు ఉన్నామంటూ అన్నారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.
 
ఇకపోతే... రుద్రమదేవి ఆడియో వేడుక వరంగల్ జిల్లాలో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు తలసాని, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు కృష్ణంరాజు, అనుష్క, అల్లు అర్జున్ హాజరై సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Friday, March 13, 2015

ఇద్దరు ముద్దుగుమ్మలతో ‘ఐ’ స్టార్ రొమాన్స్

ముంబై: సినిమా కోసం ఎంతటి ప్రయోగాలకైనా అందరికంటే ముందు వరుసలో ఉండే చియాన్ విక్రమ్ ఇప్పుడు రొమాన్స్ బాటలో పయనించడానికి సిద్దమయ్యాడు. ఇటీవలే దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విభిన్న వేషధారణతో ప్రేక్షకులకు కొత్త దనాన్ని అందించిన ఈ అపరిచితుడు ఇప్పుడు ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనుకుంటున్నారా.. ఆ హీరోయిన్లు ఒకరు ఇటీవలే టెంపర్‌లో అందాలు ఆరబోసిన కాజల్ కాగా.. మరొకరు లీడర్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఐతే సినిమాలో హీరో విక్రమ్ పాత్ర వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. విక్రమ్ తాజా సినిమాకు దర్శకుడు‘అరిమ నంబి’ ఫేమ్ ఆనంద్ శంకర్.

Sunday, October 12, 2014

నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్-2 షూటింగ్


పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిని గబ్బర్‌సింగ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి కంటిన్యూగా జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్-విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా గోపాలా.. గోపాలా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
ఈ సినిమాలో పవన్ సెకండాప్‌లో అరగంట పాటు కనిపించనున్నాడు. పవన్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించారు. పవన్ సీన్లు ఈ నెలాఖరకు పూర్తవుతాయని నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్-2 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. ఎప్పుడో అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో దర్శకుడు సంపత్‌నంది పవన్‌కు ఈ సినిమా కథ చెప్పడంతో పవన్ ఓకే చేశాడు. అప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్‌ను సంపత్‌నంది చేస్తూనే ఉన్నాడు. అయితే పవన్‌కు మాత్రం ఖాళీ ఉండడం లేదు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే సంపత్‌నంది మాత్రం తనకు పవన్ ఎప్పటికైనా అవకాశం ఇస్తాడని ఆశతో అదే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు. దీంతో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించి నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.